ఈ ప్రయత్నం మొదలెట్టి ఒక వారం గడిచిపోయింది .. ఇంకొక వీకెండ్ అన్నమాట .. బొత్తిగా ఏ అడ్వెంచర్ లేదండి జీవితంలో !! ఒక్కోసారి ఈ ఉద్యోగం వదిలేసి ఒక తెలుగు కల్చర్ పార్టీ పెట్టి .. సి/సి ++/ పర్ల్ .. లాంటి కంప్యూటర్ భాషలన్నీ తెలుగు పదాలు వాడాలని నిరహారదీక్ష చేద్దామని ఆలోచిస్తున్నా
. ఈ మధ్య ప్రతి దానికి ఈ దీక్షలు మొదలెట్టేయడం ఫ్యాషన్ కదా !!.. అప్పుడు గాని మన ప్రోగ్రాముల బోర్ తగ్గదు .. ఫర్ ఎగ్జాంపుల్ .. మా నిజామబాద్ భాషలో ఒక చారిత్రిక ప్రాధాన్యత గల ప్రోగ్రాం ఇలా ఉంటుంది ..
#దించు "రాతగీత.త"
మొదలు( ఏమద్దు )
{
చేతనైతే చెయ్యు ()
{
అచ్చెయ్యి ("నమస్తే, దునియా!");
}
కాకుంటే
{
అచ్చెయ్యి (" నాతోని అయితలేదు .. ఏడనో తప్పు అయినట్టుంది!");
}
అయిపొయింది 0;
}
.. అలాగన్న మాట!!
మా గర్జన : పైన వ్రాసిన ప్రోగ్రాం కేవలం వినోదానికి మాత్రమే .. కమర్షియల్/వ్యాపార నిమిత్తము వాడరాడని గమనిక/హెచ్చరిక/మనవి .. ఒక వేళ వాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని గుర్తించగలరు .. అటువంటి వెన్నుపోటులను మేము తీవ్రంగా ఖండిస్తాం .. అటువంటి మోసకారులను జాతి క్షమించదు .. చరిత్ర హీనులైపోతారు!!
( తెలుగు పొలిటికల్ స్పీచ్ ప్రాక్టీస్ చేస్తున్నాలే .. ఈ మధ్య ఈ పదాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి వాటిలో !!).
1:27 పూర్వాహ్నం వద్ద జనవరి J, 2010 |
మా తెలంగాణ భాష మీ కంప్యూటర్ కి సమజ్ అవుద్దా?
జర సూడ రాదె
6:35 పూర్వాహ్నం వద్ద జనవరి J, 2010 |
అన్నా .. ప్రోగ్రాం రాసిందే మన భాషలనే !!
.
దానికి సమజ్ గాకుంటే కొమరం భీం పేరు చెప్పుడే .. దెబ్బకు కిందికి దిగి అస్తది
1:40 పూర్వాహ్నం వద్ద జనవరి J, 2010 |
కెవ్వు