స్వధర్మాన్ని ఆచరిస్తూ మరణించినా మేలని ఘంటశాలగారి మధుర స్వరంతో పాడిన భగవద్గీత కొన్ని వందల సార్లు విని వుంటాను!! సాఫ్ట్వేర్ ఉద్యోగం వెలగబెడుతూ దేశ రాజధానిలో ఉన్నా తెలుగు భాష మీద మమకారం మాత్రం చావలేదు. ఆ పై తెలుగు సాహిత్య విప్లవమొకటి లేదని చానాళ్ళ నుంచి బాధ. ఇక ఇలా కాదని .. మనమే రంగప్రవేశం చేయాలని నిర్ణయించా!! కనీసం సమయం దొరికినప్పుడు కొంత మన సాహిత్య, సాంస్కృతిక సంపదలను శక్తి మేరకు నెమరు వేసుకుందామని ఈ బ్లాగ్ మొదలు పెట్టాను. తెలుగు ప్రజలు, సాహిత్యం, సంస్కృతి, రాజకీయాలు, సినిమాలు వగైరాలే కాక ఇతర అంశాల మీద కూడా తెలుగులో బ్లాగ్ చేయాలన్నది ఆశయం!! కొందరు తెలుగు మిత్రులను కూడా ఆహ్వానిస్తున్నాను. మీరు తెలుగు వారయితే దయ చేసి తెలుగు లిపిలో మీ అభిప్రాయాలు తెలుపగలరు. “వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా!!” అని గుర్తించగలరు .. కాబట్టి ఏ మాండలికంలోనైనా రాయవచ్చు!! ఆంధ్రులు ఆరంభశూరులని ఒక పెద్ద నింద ఏడిచింది మన మీద. కాబట్టి ఈ ప్రయత్నం అలా కాకూడదని ఆశిస్తున్నా!!
9:33 పూర్వాహ్నం వద్ద జనవరి J, 2010 |
Hi, this is a comment.
To delete a comment, just log in, and view the posts’ comments, there you will have the option to edit or delete them.
1:39 పూర్వాహ్నం వద్ద జనవరి J, 2010 |
చాలా మంచి ప్రయత్నం. తోటి తెలుగోడిగా నా పూర్తి చేయూత భయ్యా !
సమయం దొరికినప్పుడెల్ల ఖచ్చితంగా ఏదో ఒకటి రాస్తా. కనీసం, తరచు చదువుతా…